ఉస్మానియాకు సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి?: కవిత
ABN , Publish Date - Nov 10 , 2026 | 04:41 PM
ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ ఉద్యోగుల ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పాల్గొని.. మద్దతు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 10: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ ఉద్యోగుల ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత పాల్గొని.. మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు. ఉద్యోగులను ఉస్మానియా వీసీ పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వానికి గులాం గిరి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఏడాదిన్నరగా ఉస్మానియా నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్‌టీచింగ్ ఉద్యోగుల కోసం పర్మినెంట్ ఉద్యోగులు పోరాటం చేయడం అభినందనీయమన్నారు. వర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉస్మానియా నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలపై యూనవర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ స్పందించాలని కవిత కోరారు.
ఇవి కూడా చదవండి...
‘అగ్రికల్చర్ వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోండి’.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కరవుతో ఇబ్బందుల్లో రైతులు.. పంట రుణాల రీషెడ్యూల్‌కు భట్టి ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News