Share News

‘అగ్రికల్చర్ వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోండి’.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:15 PM

అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యపై రాష్ట్ర గవర్నర్‌‌కు మహిళా ప్రొఫెసర్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి వీసీపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

‘అగ్రికల్చర్ వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోండి’.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
Telangana Agriculture University

హైదరాబాద్, నవంబర్ 10: అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యపై రాష్ట్ర గవర్నర్‌‌కు మహిళా ప్రొఫెసర్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి వీసీపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే డీజీపీకి, ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ చేపట్టిన ఆందోళనలకు మహిళా నేతలు మద్దతుపలికారు. వీసీకి వ్యతిరేకంగా మాట్లాడితే బదిలీలు చేస్తున్నారంటూ మహిళా ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో 1150 మందిని వీసీ జానయ్య బదిలీ చేసినట్లు తెలుస్తోంది.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని.. ఈ విషయంపై డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఫిర్యాదు చేసిన దానిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. వీసీ జానయ్య.. తన ఛాంబర్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని.. తనతో పాటు ఢిల్లీకి రావాలని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.


వైస్ ఛాన్సలర్ జానయ్యకు ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్లు అండగా ఉన్నారని బాధితురాలు తెలిపారు. ఉమెన్ కమిషన్ ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిందని.. మహిళా కమిషన్‌కు తన వద్ద ఉన్న ఆధారాలన్నీ ఇస్తానని అన్నారు. వీసీ జానయ్యను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బందులకు గురి చేశారన్నారు. నాలాంటి మహిళలు చాలామంది అతని చేతిలో వేధింపులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ‘నన్ను ట్రాన్స్‌ఫర్ చేయడం వల్లే ఆరోపిస్తున్నానని అవాస్తవాలు చెబుతున్నారు’ అంటూ మహిళా ప్రొఫెసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంపై రాహుల్‌తో చర్చించా: మహేశ్ గౌడ్

ఏపీలో జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 03:31 PM