సీఎంవో పేరుతో పిలిచి.. సంతోష్ డీల్!
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:31 AM
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనకు తెలియకుండానే.. సీఎంవో పేరుతో హిందూజా గ్రూప్ ప్రతినిధిని జోగినపల్లి సంతోష్‌రావు హైదరాబాద్‌కు పిలిపించారని..
గల్ఫ్ ఆయిల్ భూములపై రూ.1000 కోట్ల లబ్ధి
కేసీఆర్‌కు తెల్వదు.. కేటీఆర్, హరీశ్‌కు తెల్వదనుకోను
యూట్యూబ్ ఇంటర్వ్యూలో కవిత
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనకు తెలియకుండానే.. సీఎంవో పేరుతో హిందూజా గ్రూప్ ప్రతినిధిని జోగినపల్లి సంతోష్‌రావు హైదరాబాద్‌కు పిలిపించారని.. ఆ ఒక్క సమావేశంలోనే గల్ఫ్ ఆయిల్ భూముల వ్యవహారాన్ని సెటిల్ చేసి రూ.1,000 కోట్లు లబ్ధి పొందారని.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. గల్ఫ్ ఆయిల్ భూములు హిందూజాలవని.. 2014 చివర్లో లేదా 2015 మొదట్లో ‘‘సీఎంగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’’ అంటూ తెలంగాణ సీఎంవో నుంచి వారికి ఒక మెయిల్ వెళ్లిందని.. దాంతో దుబాయ్ నుంచి ఒకాయన సూటుబూటు వేసుకుని ఫ్లైట్‌లో వస్తే ఇక్కడ ఆయన్ను కలిసింది సంతోష్ అని ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.
ఆయన వచ్చినట్టు, ఆయన్ను సంతోష్ కలిసినట్టు కూడా చాలా ఏళ్ల వరకూ కేసీఆర్‌కు తెలియదని చెప్పారు. అయితే.. ‘‘ఈ వ్యవహారం కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు తెలవకుండా ఉంటదని అనుకోను’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘వాస్తవానికి సీఎంవోలో రోజుకు వెయ్యి నిర్ణయాలు జరిగితే 50 సీఎం చెప్తారు. మిగతా 950 రొటీన్‌గా జరుగుతుంటాయి. ఆ రొటీన్ నిర్ణయాల దగ్గర నిలబడి, గేట్ కాపలా కాసి, కరెక్ట్ నిర్ణయాలు చేయాల్సినవాళ్లు ఉంటారు. వాళ్లందరూ అవినీతికి తెర తీశారు’’ అని కవిత ధ్వజమెత్తారు.
రేవంత్ చేతగానితనంతోనే ఏపీకి కృష్ణా నీళ్లు
కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతోందంటే.. అందుకు కారణం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయతేనని, రాష్ట్రానికి ఆయన చేతగానితనం శాపంగా మారిందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ.. కొవ్వూరు పట్టణానికి చెందిన తన ప్రాణ స్నేహితురాలి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా మనందరం ఎప్పుడూ కలిసి ఉండాలనేదే తన అభిమతమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News