చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును నిర్మించగలరు: కవిత
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:37 AM
చరిత్రను తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును చక్కగా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 15: చరిత్రను తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును చక్కగా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ... బ్రిటీష్ పాలనలో జరిగిన అఘాయిత్యాలు, విభజించి పాలించిన విధానం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలకు భారతీయులను సైనికులుగా వాడుకొని ఎంతో మంది చావులకు కారణమయ్యారని మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్లు వచ్చిన తర్వాతే కుల వ్యవస్థ మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. అడవుల్లో ఉండే ఆదివాసీలను రాజ్యం పరిధిలోకి తెచ్చి తీరని అన్యాయం చేశారన్నారు.
బ్రిటీష్ పరిపాలన పోయినప్పటికీ వాళ్ల ఆలోచనా విధానాన్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్లే గొప్ప అన్నట్లుగా చూస్తున్నారని.. తెలుగు భాష మాట్లాడితే తక్కువ చేసి చూస్తున్నారని మండిపడ్డారు. ‘తెల్ల తోలు గొప్ప, నల్ల తోలు కాదన్నట్లుగా ప్రచారం చేసి మనలో మనల్ని శత్రువులను చేశారు’ అని అన్నారు. ఆనాటి బ్రిటీష్ వాళ్ల పరిపాలన, ఆలోచనా విధానాన్ని వీడాలని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News