Share News

గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:04 PM

గిగ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయన్నారు.

గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, జులై 22: గిగ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని అన్నారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలటం లేదని తెలిపారు.


మూడేళ్లుగా రేట్లు పెంచాలని వాళ్లు అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కవిత విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడాలన్నారు. వాళ్లకు మంచి రేట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ ఈరోజు మధ్యాహ్నం వరకు గిగ్ వర్కర్లు, డ్రైవర్లు బ్రేక్ డౌన్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల వైపు ఉండి వాళ్ల సమస్యలు వెంటనే తీర్చాలని కవిత డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 12:06 PM