జస్టిస్ లక్ష్మణ్‌గౌడ్‌కు పితృవియోగం
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:39 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్‌కి పితృ వియోగం కలిగింది.
హైకోర్టు తాత్కాలిక సీజే సహా పలువురి నివాళి
రామన్నపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్‌కి పితృ వియోగం కలిగింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ.. కొన్ని నెలలుగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జస్టిస్ లక్ష్మణ్ గౌడ్ తండ్రి గోపాల్‌గౌడ్ (84) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని గోపాల్‌గౌడ్ సొంతూరు బోగారానికి తరలించారు.
ఈ సంగతి తెలియగానే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్‌కోషి, జస్టి్‌సలు బి.విజయసేన్‌రెడ్డి, సురేపల్లి నంద, జె.శ్రీదేవి, టి.మాధవిదేవి, పి.కార్తీక్, ఎన్.రాజేశ్వరరావు, ఎన్.శ్రవణ్‌కుమార్, అదనపు న్యాయమూర్తి జస్టిస్ మొయినుద్దీన్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. జస్టిస్ లక్ష్మణ్‌గౌడ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా కోర్టుతోపాటు, రామన్నపేట, చౌటుప్పల్ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, రామన్నపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు నివాళులర్పించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తుల రాకతో బోగారం గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News