ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్ పోరాటం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:23 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆయనకు మద్దతుగా మనమంతా వీధుల్లోకి రావాల్సిందే: జగ్గారెడ్డి
రాహుల్ ఢిల్లీ రోడ్లపై ఉంటే మనం ఇళ్లలో పడుకోవడం కరెక్టేనా?
దేశంలో ఓట్ చోరీ జరుగుతోంది.. ప్రజల హక్కుల్ని బీజేపీ కాలరాస్తోంది
జ్ఞానేశ్ రాజీనామా చేసే దాకా పోరాటం ఆపబోనని రాహుల్ ప్రకటించారు
ఆయనకు మద్దతుగా సంగారెడ్డిలో నా పోరాటాన్ని కొనసాగిస్తా: జగ్గారెడ్డి
రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహణ
సంగారెడ్డి టౌన్, అక్టోబరు 12, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ గెస్ట్‌హౌస్ నుంచి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేడ్కర్ చౌక్ వరకు సాగిన ర్యాలీలో జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు వేలమంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ’’జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి‘‘, ’’మోదీ డౌన్ డౌన్‘‘, ’’రాహుల్ గాంధీ జిందాబాద్‘‘ అంటూ ర్యాలీ పొడవునా కార్యకర్తలు నినాదాలు చేశారు. అంబేడ్కర్ చౌక్‌కు ర్యాలీ చేరుకున్నాక రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ’’రాహుల్ గాంధీ ఢిల్లీ రోడ్లపై పోరాడుతుంటే మనం ఇళ్లలో విశ్రాంతి తీసుకోవడం సరైనదేనా? అని ప్రశ్నించారు. తనకు ఢిల్లీ వెళ్లగలిగే అవకాశం ఉన్నా, రాహుల్ గాంధీ పోరాటానికి స్థానికంగా సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలోనే ఉండి ర్యాలీ నిర్వహించినట్లు వివరించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే దాకా పోరాటం ఆపబోమని రాహుల్ గాంధీ ప్రకటించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ’’రాహుల్ గాంధీ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఆయనకు మనం మద్దతుగా నిలవాలి‘‘ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఉపాధి కోసం వెళ్లి..మృత్యువుతో పోరాటం
Read Latest AP News And Telangana News And International