Share News

సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:38 AM

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ రాసిన ’బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం ఆధారంగా ఆమె జీవితంపై సినిమా తీస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు.

సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా
Jagga Reddy

  • సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలు

  • సోనియా రాసిన ’బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంపై జగ్గారెడ్డి ప్రకటన

  • నిర్మాణంపై 50 మందితో కమిటీ

  • సీఎం, టీపీసీసీ చీఫ్‌తో క్లాప్‌ కొట్టిస్తా

  • దేశంలోని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, కులాలపై ఆమెకు అవగాహన

  • రాహుల్‌, ప్రియాంకను నడిపిస్తున్న ఘనత సోనియాదేనని ప్రశంసలు

సంగారెడ్డి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ రాసిన ’బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం ఆధారంగా ఆమె జీవితంపై సినిమా తీస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలని వెల్లడించారు. 25న జరగనున్న తన కొడుకు భరత్‌సాయిరెడ్డి వివాహ వేడుకకు సంబంధించి బుధవారం సంగారెడ్డిలో ఆయన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరై తన కుమారుడిని ఆశీర్వదించాలని వారిని పేరుపేరునా ఆహ్వానించారు. అనంతరం సోనియా రాసిన పుస్తకం గురించి ప్రస్తావించారు. ఆమె జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారని.. అయినా విజయవంతమైన నాయకురాలిగా ఎదిగారని కొనియాడారు.


మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా వదులుకున్నారని చెప్పారు. ఈ దేశం కోసం రాహుల్‌, ప్రియాంకను ముందుకు నడిపిస్తున్న ఘనత కూడా ఆమెదేనని ప్రశంసించారు. సముద్రమంత లోతున్న కాంగ్రెస్‌ రాజకీయాన్ని అధ్యయనం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జగ్గారెడ్డి కొనియాడారు. ఈ దేశంలోని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, పరిస్థితులపై సమగ్ర అవగాహన ఆమెకు ఉన్నందునే ఉపాధి హామీ పథకాన్ని ఆచరణలోకి తెచ్చారని తెలిపారు. సోనియాగాంధీ జీవితంపై ముందుగా తెలుగులో సినిమాను తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇందుకోసం 50 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనికి గాంధీభవన్‌ పీఆర్‌వో హరిప్రసాద్‌ పర్యవేక్షకులుగా ఉంటారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో క్లాప్‌ కొట్టించి షూటింగ్‌ ప్రారంభించేలా త్వరలోనే సన్నాహాలు చేస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:38 AM