Share News

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోసం రాహుల్‌ చేస్తున్న పోరాటంలో మేమంతా సైనికులమే

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:43 AM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటంలో సైనికులుగా ఉంటామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోసం రాహుల్‌ చేస్తున్న పోరాటంలో మేమంతా సైనికులమే
Jagga Reddy

  • రాహుల్‌ ప్రధాని కావాలి..

  • ఆ దిశగా అవిశ్రాంత పోరాటం

  • దేశం సంతోషంగా ఉండాలంటే ఇందిరమ్మ పాలన మళ్లీ రావాలి

  • ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌ అలుపెరుగని పోరాటం

  • ఢిల్లీలో జరిగిన బహిరంగసభను కార్యకర్తలు, ప్రజలతో కలిసి సంగారెడ్డిలో ప్రత్యక్షప్రసారం చూసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటంలో సైనికులుగా ఉంటామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ ప్రధానమంత్రి అయ్యేవరకు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త అవిశ్రాంతంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం జరిగిన బహిరంగసభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జగ్గారెడ్డి భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు.


కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆయన సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. ఇందిర హయాంలో పేదలు సంతోషంగా ఉన్నారని.. మళ్లీ ఆ పరిపాలన రావాలంటే రాహుల్‌గాంధీతోనే సాధ్యమని పేర్కొన్నారు. తన భార్య నిర్మలతోపాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ తరలివెళ్లారని వెల్లడించారు. తాను మాత్రం సంగారెడ్డిలోనే ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీ సభలో నేతలు చేసిన ప్రసంగాలను విన్నానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:44 AM