మాజీమంత్రి తలసాని సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:44 AM
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఐడీహెచ్ కాలనీ పార్దీవాడలోని అడవి మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి నమ్మకాలు,విశ్వాసాలు వారికి ఉంటాయని వాటిని ప్రతీ ఒక్కరూ గౌరవించాలని అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏరోజు తాగునీరు, విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాలేదని,
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పనితీరుతో ప్రజలు విసుగెత్తారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే వెంట పద్మారావునగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, వెంకటేశన్‌రాజు, ఏసూరి మహేశ్, అంబులెన్స్ సురేశ్, మహేందర్‌గౌడ్, లక్ష్మిపతి, శ్రీకాంత్‌రెడ్డి, కొత్తూరు వెంకటేశ్, ప్రేమ్, అరుణ్, గజ్జెల శ్రీనివాస్, నాగలక్ష్మి, కామ్‌రాజ్, హామ్‌రాజ్, సద్దు తదితరులు ఉన్నారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి, సమ్మెను విరమింపజేయాలని తలసాని డిమాండు చేశారు. బుధవారం ఐడీహెచ్ కాలనీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు అవసరమైన శిక్షణను అందించి ఎలక్ర్టిక్ బస్సులకు నియమించాలని అన్నారు. సమ్మె కారణంగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు అవస్తలు పడుతున్నారని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వారం రోజులుగా కలుషిత నీటి సరఫరా
Read Latest Telangana News and National News