ఐపీఎల్ వేళ యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:04 PM
ఐపీఎల్ అంటే గుర్తొచ్చే మరో విషయం బెట్టింగ్. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. అమయాక యువతను లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటుంటారు.
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు ఐపీఎస్-2026 పండుగ మెుదలైంది. ఇవాళ(శనివారం) రాత్రి 07:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ మే 31 వరకు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తంగా 10 జట్లు తలపడనుండగా.. 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
సీపీ సజ్జనార్ హెచ్చరిక..
అయితే, ఐపీఎల్ అంటే గుర్తొచ్చే మరో విషయం బెట్టింగ్. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. అమయాక యువతను లక్ష్యంగా చేసుకుని కోట్లు దండుకుంటుంటారు. ఐపీఎల్ వేళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఈ సందర్భంగా యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్ వల్ల అప్పులు పెరిగి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాని జోలికి వెళ్లకుండా క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని యువతకు పిలుపునిచ్చారు.
#SayNoToBettingApps ప్రచారంతో ఇప్పటికే వందల యాప్‌లు నిషేధించినట్లు సజ్జనార్ తెలిపారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్తగా బెట్టింగ్ దందా చేస్తున్నారని మండిపడ్డారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పైనా ప్రత్యేక నిఘా పెట్టినట్లు హెచ్చరించారు. ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రదేశాల్లో జరిగే బెట్టింగ్‌లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. బెట్టింగ్ మాఫియా చేతుల్లో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా 94906 16555 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంత అడ్డుకోవాలని చూసినా ఆగదు.. ఇది దైవ కార్యం: సీఎం రేవంత్ రెడ్డి..
కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్