ఓఆర్‌ఆర్ నుంచి నేరుగా గ్లోబల్ సమ్మిట్‌కు!
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:36 AM
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఏర్పాట్లపైనా దృష్టి పెట్టింది.
రతన్‌టాటా ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానంగా ఉన్న
సర్వీసు రోడ్డును శరవేగంగా నిర్మించాలని నిర్ణయం
ఈ రోడ్డు ద్వారానే వేదిక వద్దకు ప్రతినిధుల రాక
రంగారెడ్డి అర్బన్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఏర్పాట్లపైనా దృష్టి పెట్టింది. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి విచ్చేసే ప్రతినిధులను ఏయే రహదారు ల ద్వారా వేదికకు వద్దకు తీసుకురావాలన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రధానవేదిక వద్దకు ప్రతినిధులను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీలో సమ్మిట్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. గత ఏడాది బేగరికంచె-మీర్‌ఖాన్‌పేట పరిధిలోని టీజీఐఐసీ లేఅవుట్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-14 నుంచి హైదరాబాద్- శ్రీశైలం రహదారి మీదుగా, కొత్తూరు జంక్షన్ నుంచి ఫార్మా రోడ్డు మీదుగా వాహనాలు చేరుకున్నాయి.
అయితే, ఈసారి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-13 నుంచి నేరుగా సమ్మిట్ ప్రాంగణానికి ప్రతినిధులు చేరుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ద్వారానే దేశ, విదేశీ ప్రతినిధులను వేదిక వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించినా.. పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొదట దశ పనులకే మరో 3 నెలల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో రతన్‌టాటా ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానంగా ఉన్న సర్వీసు రోడ్డును పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బీటీ పనులు వేగంగా సాగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-13నుంచి సర్వీసు రోడ్డు ద్వారా నేరుగా వేదిక వద్దకు తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News