Share News

19న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ ప్రారంభం

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:42 AM

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

19న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ ప్రారంభం
Bhatti Vikramarka

  • ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే: భట్టి

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలుచేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని అన్నారు.


అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భట్టి మాట్లాడుతూ... ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో, సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతంలో అమలైన కొన్ని బీమా పథకాలు కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిజమైన సార్వత్రిక జీవిత బీమా పథకమని తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని, ఈ పథకాన్ని సీఎం రేవంత్‌ అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 04:42 AM