హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ యోగితా రాణా
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:01 AM
పలు కోర్టు ధిక్కరణ కేసుల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా సోమవారం మరోసారి ప్రత్యక్షంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట హాజరయ్యారు.
వెంటాడుతున్న కోర్టు ధిక్కరణ కేసులు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పలు కోర్టు ధిక్కరణ కేసుల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా సోమవారం మరోసారి ప్రత్యక్షంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట హాజరయ్యారు. డీఎస్సీ - 2002 హిందీ పండిట్ల నియామక ప్రక్రియకు సంబంధించిన కేసుల్లో ఆమె ఇప్పటి వరకు ఆరేడు సార్లు వరుసగా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పిటిషనర్లను ఉపాధ్యాయులుగా నియమించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు అమలు చేయలేదంటూ నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సంధ్య సహా ఆరుగురు అభ్యర్థులు వేర్వేరుగా యోగితా రాణాపై ఆరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం, పిటిషనర్ల వివరణ కోసం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఆ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా ప్రత్యక్షంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News