Share News

ఐఏఎస్‌ రాజీవ్‌ హనుమంతుకు రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:49 AM

తెలంగాణ రెవెన్యూ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ హనుమంతు ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఐఏఎస్‌ రాజీవ్‌ హనుమంతుకు రోడ్డు ప్రమాదం
IAS Rajeev Hanumanthu

  • ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘటన

  • హనుమంతు, ఆయన కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ

హైదరాబాద్‌, నవంబరు 14 : తెలంగాణ రెవెన్యూ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ హనుమంతు ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రాజీవ్‌ హనుమంతు తన కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమల నుంచి శ్రీశైలం వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా చాపరాళ్లపల్లి వద్ద ఓ స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో కారులో ఉన్న రాజీవ్‌ హనుమంతు, ఆయన కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఐజీ రాజీవ్‌ హనుమంతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. హనుమంతుతోపాటు ఆయన కుటుంబసభ్యుల పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 06:49 AM