ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:26 PM
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగే రోజుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున.. ఆయా రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు నగర పోలీసులు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 5వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి. ఇప్పటికే ఒక మ్యాచ్ పూర్తవగా.. ఏప్రిల్ 13వ తేదీన మరో మ్యాచ్ ఉంది. ఎస్ఆర్‌హెచ్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ జంక్షన్ వైపు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరంగల్ - హైదరాబాద్ మధ్య ప్రయాణించే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ORR ఎక్కాలని పోలీసులు సూచించారు.
స్టేడియం పరిసరాల్లో 5 ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలకు స్టేడియం బయట 4 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా.. VIP/VVIPలకు స్టేడియం లోపల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేడియానికి వచ్చేవారు మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలు నాగోల్, ఎల్‌బీనగర్ వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:
ఆశా భోంస్లే మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాళి
విశ్వం వైపు చూస్తూ సేద తీరేందుకు ఉత్తమ చోటు!
డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!