Share News

బంగారం వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్.. ముఠాకు సుపారీ ఇచ్చిన..

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:46 AM

చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార లావాదేవీల్లో వివాదాల కారణంగా శ్రీనివాసరావును కిడ్నాప్ చేయాలని ఓ ముఠాకు శ్రీకాంత్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బంగారం వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్.. ముఠాకు సుపారీ ఇచ్చిన..

హైదరాబాద్, అక్టోబర్ 15: చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార లావాదేవీల్లో వివాదాల కారణంగా శ్రీనివాసరావును కిడ్నాప్ చేయాలని ఓ ముఠాకు శ్రీకాంత్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుపారీ డబ్బులు శ్రీకాంత్‌ నుంచి కిడ్నాపర్లు సురేష్ అండ్ కో ముందే వసూలు చేశారు. అనంతరం పథకం పన్ని వ్యాపారిని కిడ్నాప్ చేసి నిర్బంధించారు. ఒప్పందం ప్రకారం శ్రీనివాసరావును శ్రీకాంత్‌కు అప్పగించాలి. కానీ కిడ్నాపర్లు అలా చేయకుండా కొత్త స్కెచ్ వేశారు.


బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు కాల్ చేసి కిడ్నాపర్లు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ విషయం శ్రీకాంత్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు రూ. కోటి ఇవ్వడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో డబ్బు తీసుకుని శ్రీనివాసరావును వదిలేశారు. శ్రీకాంత్‌కు కాల్ చేసి బంగారం వ్యాపారి తమ వద్ద నుంచి పారిపోయాడని నాటకమడారు. ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది.

హైదరాబాద్ చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావును ఈనెల (అక్టోబరు) 5వ తేదీన కొంతమంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రామంతపూర్‌లోని తన బంగారం షాపు నుంచి వ్యాపారిని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి నుంచి కోటి రూపాయల నగదును రికవరీ చేశారు.


ఈ వార్తలూ చదవండి

పాలమూరు బాహుబలి మోటార్లు ప్రారంభం

పశుగ్రాసం కొరత రానియొద్దు: తుమ్మల

Updated Date - Oct 15 , 2026 | 10:53 AM