పశుగ్రాసం కొరత రానియొద్దు: తుమ్మల
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:45 AM
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే యాసంగి (రబీ) సీజన్లో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాని, అవసరమైతే జిల్లా కలెక్టర్లే వానాకాలం పశుగ్రాసాన్ని (గడ్డి) కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే యాసంగి (రబీ) సీజన్లో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాని, అవసరమైతే జిల్లా కలెక్టర్లే వానాకాలం పశుగ్రాసాన్ని (గడ్డి) కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గత రబీ సీజన్లో దాదాపు 18 లక్షల ఎకరాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారని మంత్రి గుర్తు చేశారు.
ఈ వానాకాలం కోతల తర్వాత పంట వ్యర్థాలను కాల్చకుండా, వాటిని పశుగ్రాసంగా వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతికతో అనుసంధానిస్తూ, టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
న్యూయార్క్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత
ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు
Read Latest AP News And Telangana News And International