ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ప్రారంభం రేపు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:52 AM
విజయవాడలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్మారక ట్రస్టు భవనం, బ్లడ్ బ్యాంకులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి.
ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి
విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్మారక ట్రస్టు భవనం, బ్లడ్ బ్యాంకులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. గురునానక్ కాలనీలో నిర్మించిన ఈ భవనాలకు గత ఏడాది శంకుస్థాపన జరగగా ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. ఆరోజు ఉదయం 8.30 గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..