Share News

పాలమూరు బాహుబలి మోటార్లు ప్రారంభం

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:37 AM

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

పాలమూరు బాహుబలి మోటార్లు ప్రారంభం
Palamuru Rangareddy Project Pumps

  • నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి పరుగులు పెట్టిన కృష్ణానది జలాలు

  • సాగు, తాగునీరు అందించడమే ధ్యేయం: మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండ లం బోడబండ తండా శివారులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) పంపు హౌస్‌లోని 1, 2వ భారీ బాహుబలి మో టార్లను ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ పంపుల ద్వారా నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణా జలాలకు పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. పాలమూరు ఎత్తిపోత ల పథకం పనులను పూర్తి చేయకుండానే దీన్ని గత ప్రభుత్వంలో జాతికి అంకితం చేశారని.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌, ఇతర పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.20 - 25 వేల కోట్లు మాత్రమే వెచ్చించిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంతో ప్రాజెక్టుల వారీగా సమస్యలను గుర్తించి, పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

ఎఫ్‌ఎంజీల ఇంటర్న్‌షిప్‌ రద్దు చేద్దాం!

పీజీ మెడికల్‌ ‘కన్వీనర్‌’ సీట్లకు నేటి నుంచే దరఖాస్తులు..

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:37 AM