పీజీ మెడికల్ ‘కన్వీనర్’ సీట్లకు నేటి నుంచే దరఖాస్తులు..
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:30 AM
రాష్ట్రంలోని పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నాన్-సర్వీస్, ఇన్-సర్వీస్ అభ్యర్థుల నుంచి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 4 వరకు https://tspgmed.tsche.in వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్ల తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. నీట్ పీజీ-2026 పరీక్షలో నిర్దేశిత కటాఫ్ స్కోరు సాధించిన వారు.. తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ సీట్లకు అర్హులని వర్సిటీ వెల్లడించింది. పూర్తి వివరాలను హెల్త్ వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎఫ్ఎంజీల ఇంటర్న్షిప్ రద్దు చేద్దాం!
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International