ఎఫ్ఎంజీల ఇంటర్న్షిప్ రద్దు చేద్దాం!
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:26 AM
రాష్ట్రంలో చదివిన వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైపెండ్ ఇవ్వాలని కొద్ది రోజులుగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు (ఎఫ్ఎంజీలు) ఆందోళన చేస్తున్న వేళ.. ప్రభుత్వానికి వైద్య శాఖ కీలక నివేదిక అందించింది.
బోధనాస్పత్రుల్లో వారి సేవలు అవసరం లేదు
ప్రభుత్వానికి నివేదిక అందించిన వైద్య శాఖ
రాష్ట్రంలో చదివిన వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైపెండ్ ఇవ్వాలని కొద్ది రోజులుగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు (ఎఫ్ఎంజీలు) ఆందోళన చేస్తున్న వేళ.. ప్రభుత్వానికి వైద్య శాఖ కీలక నివేదిక అందించింది. బోధనాస్పత్రుల్లో ఎఫ్ఎంజీల ఇంటర్న్షిప్ రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఎఫ్ఎంజీలకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించడమే కాకుండా మానవతా దృక్పథంతో రూ.5వేల స్టైపెండ్ చెల్లిస్తున్నామని, దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా ఆందోళనల పేరిట రోగుల సేవలకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంది.
రాష్ట్రంలో చదివిన వారితో సమానంగా తమకు స్టైపెండ్ చెల్లించాలంటూ కొన్ని రోజులుగా ఎఫ్ఎంజీలు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం కోఠీలోని వైద్యవిద్య సంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. భారతీయ వైద్య విద్యార్థులతో సమానంగా తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే వివిఽధ రాష్ట్రాల్లో ఎఫ్ఎంజీల ఇంటర్న్షి్పపై స్టడీ చేసిన వైద్యశాఖ అధికారులు.. సర్కారుకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఎఫ్ఎంజీల అవసరం ఏమాత్రం లేదని తెలిపినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International