హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. రూ.600కే అపరిమిత ప్రయాణం
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:38 PM
నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారం పాటు అపరిమిత బస్సు ప్రయాణం కోసం వీక్లీ పాస్ తెచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 25: నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారం పాటు అపరిమిత బస్సు ప్రయాణం కోసం వీక్లీ పాస్ తెచ్చింది. రూ.600కే ఈ పాస్ కొనుగోలు చేసి గ్రేటర్ పరిధిలో ఏడు రోజుల వరకూ బస్సులో ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ బస్సు ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఈ వీక్లీ పాస్‌తో గ్రేటర్ పరిధిలోని ఏసీ బస్సులతో పాటు అన్ని రకాల సిటీ బస్సులో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఇవి వర్తించవు. ఈ పాస్‌లు నగరంలోని అన్ని ఆర్టీసీ కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిని కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి ఏడు రోజుల వరకు ఇవి చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
నీటి వృథాపై రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కీలక నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ షాపుల్లో టీజీ సేఫ్ తనిఖీలు