తెలంగాణ TG-iPASS పోర్టల్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన సేవలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 09:33 AM
తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన TG-iPASS పోర్టల్‌పై సైబర్ దాడి కలకలం రేపింది. అక్టోబర్ 22 రాత్రి నుంచి పోర్టల్ పనిచేయకపోవడంతో పరిశ్రమలకు సంబంధించిన వ్యాపార అనుమతుల సేవలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన TG-iPASS పోర్టల్‌పై సైబర్ దాడి కలకలం రేపింది. అక్టోబర్ 22 రాత్రి నుంచి ఈ పోర్టల్ పనిచేయడం నిలిచిపోయింది. హ్యాకర్లు డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో పాటు ఫైళ్ల పేర్లకు .vgb ఎక్స్‌టెన్షన్ జోడించినట్లు అధికారులు గుర్తించారు. సర్వర్‌లో రాన్సమ్ నోట్ కూడా కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకర్లు సంప్రదింపుల కోసం ఈమెయిల్ చిరునామాను మాత్రమే అందించినట్లు సమాచారం. పోర్టల్ సేవలు నిలిచిపోవడంతో పరిశ్రమలకు సంబంధించిన వ్యాపార అనుమతుల ప్రక్రియపై ప్రభావం పడింది. దీంతో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేశారు. సర్వర్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించి, డేటా చోరీ జరిగిందా? హ్యాకర్లు సమాచారాన్ని బయటకు తరలించారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. మరోవైపు, డేటా బ్యాకప్ అందుబాటులో ఉందని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. పోర్టల్‌ను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయానికి సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. అయితే, సైబర్ దాడి వెనుక ఎవరున్నారు? ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారం ఎంతవరకు ప్రభావితమైంది? అనే అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News