ఈవీ.. రయ్ రయ్.. గ్రేటర్‌లో అన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Jun 27 , 2026 | 09:59 AM
గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది.
ప్రస్తుతం అందుబాటులోకి 500
డిసెంబర్ నాటికి మరో 500 లక్ష్యంగా ఆర్టీసీ ప్రణాళికలు
240 డీజిల్ బస్సులకు రెట్రోఫిట్టింగ్
వచ్చే రెండేళ్లలో 2,800 బస్సులు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది. గ్రేటర్‌జోన్‌లో ప్రస్తుతం 500 ఈవీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 500 బస్సులు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 240 డీజిల్ బస్సులను రెట్రో ఫిట్టింగ్‌తో ఎలక్ట్రిక్‌గా మార్చుతున్నది. గ్రేటర్ జోన్‌లో రెండేళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నది. గ్రేటర్‌జోన్‌లో అన్నీ రూట్లలో ఈవీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా లింగంపల్లి- మెహిదీపట్నం, హయత్‌నగర్- లింగంపల్లి, సికింద్రాబాద్-కొండాపూర్, సికింద్రాబాద్- పటాన్‌చెరు, కోఠి- పటాన్‌చెరు, ఎన్‌జీవో కాలనీ- మెహిదీపట్నం, సికింద్రాబాద్- మణికొండ, లింగంపల్లి- కోఠితో పాటు ప్రధానరూట్లలో ఈవీ బస్సులు నడుపుతున్నారు. మియాపూర్ - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 22, సికింద్రాబాద్ - ఎయిర్‌పోర్ట్‌కు 40 ఈవీ బస్సులు రోజూ నడుపుతున్నారు. ఎలక్ర్టిక్ బస్సుల ఎర్నింగ్ పర్ కిలోమీటర్ (ఈపీకే) 65-70 శాతంగా ఉంటుంది. 26 బస్ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది.
రెండేళ్ల తర్వాత...
2027 డిసెంబరు తర్వాత గ్రేటర్‌లో డీజిల్ బస్సులు నడుపుకూడదనే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. అద్దె ప్రాతిపదికన 1500, మరో 1300 ఈవీ బస్సులు ప్రభుత్వ సహకారంతో తీసుకురావాలని భావిస్తోంది. రెండేళ్ల తర్వాత కేవలం ఈవీ బస్సులనే నడపాలని, డీజిల్ బస్సులు ఓఆర్‌ఆర్ అవతలే నడపాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
డిపోలవారీగా ఈవీ
హయత్‌నగర్ 2 100
హెచ్‌సీయూ 106
కూకట్‌పల్లి 60
మియాపూర్ 101
కంటోన్మెంట్ 80
రాణిగంజ్ 70
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వీకెండ్ థెరపీ.. ఉపశమనం కోసం వెల్‌నెస్ సెంటర్లకు
Read Latest AP News And Telangana News And International News And Telugu News