గచ్చిబౌలి ‘అంతేరా’ సహా.. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:02 AM
ఆహార భద్రత, కల్తీ నివారణే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ స్టాండర్డ్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసన్షియల్ డ్రగ్స్ (టీజీసేఫ్) అధికారులు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లపై శనివారం మెరుపుదాడులు నిర్వహించారు.
మరో 9 రెస్టారెంట్లకు నోటీసులు
కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకల సంచారం
హైదరాబాద్‌లోని 20 రెస్టారెంట్లపై టీజీసేఫ్ దాడులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆహార భద్రత, కల్తీ నివారణే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ స్టాండర్డ్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసన్షియల్ డ్రగ్స్ (టీజీసేఫ్) అధికారులు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లపై శనివారం మెరుపుదాడులు నిర్వహించారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఐటీ కారిడార్ పరిధిలోని 20 హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
కిచెన్లలో తీవ్ర అపరిశుభ్రత, కుళ్లిన కూరగాయలు, గుడ్లు, కాలం చెల్లిన పదార్థాల వినియోగం, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించిన అధికారులు గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్ అండ్ బార్, అల్ సబా రెస్టారెంట్, ఉడిపి ఉపాహార్, ఇనార్బిట్ మాల్‌లోని అం అహ తెలుగు కిచెన్ అండ్ బార్, ఫ్యూజన్, మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్, సాయిరామ్ మెస్ వంటి మొత్తం 11 రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు. రామేశ్వరం కేఫ్, హోటల్ షాదాబ్, షాగౌస్ వంటి 6 రెస్టారెంట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, మరో 3 రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా 21 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రశాంతంగా నిమజ్జనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News