Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9 గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jun 19 , 2026 | 07:27 AM

హైదరాబాద్‌ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్‌కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9 గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

హైదరాబాద్: ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్‌కుమార్‌ తెలిపారు. ఫీవర్‌ ఆస్పత్రి, జామై ఉస్మానియా, సాయిమధురానగర్‌, 44నెంబర్‌ బస్టాప్‌, రాఘవేంద్రస్వామి టెంపుల్‌ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కూచిపూడి, ఆర్‌కే మఠ్‌, ఆనంద్‌నగర్‌, బషీర్‌బాగ్‌, లోకాయుక్త ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మూన్‌కేఫ్, అయ్యప్పటెంపుల్‌, మదర్‌ డయిరీ, వైఎంసీఏ, బాలాజీ ఇంద్రప్రస్థ, ఎన్‌కేఎంఎస్, కామినేని ఆసుపత్రి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


సంతోష్‌నగర్‌: టీజీఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతులు, చెట్లకొమ్మల కొట్టివేత పనుల కారణంగా శుక్రవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ వి-గార్డ్‌, విజయ్‌నగర్‌కాలనీ, హరిపురి, టీఎస్‌ హౌసింగ్‌బోర్డు, దేశ్‌ముఖ్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12.గంటల వరకు, 11కేవీ శివపురికాలనీ, కోహెడ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 11కేవీ ఇందిరనగర్‌, చిత్రాలేఆవుట్‌, భగత్‌సింగ్‌నగర్‌, శివంహిల్స్‌, వాసవికాలనీ, పెద్దఅంబర్‌పేట్‌, ఇందుఅరణ్యఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.


ఇంజాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో..

హయత్‌నగర్‌: ఇంజాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11కేవీ లైన్స్‌ నిర్వహణ మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాములు తెలిపారు. 11 కేవీ సైబర్‌ సిటీ పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంజానాపురి, స్కూప్స్‌, సైబర్‌సిటీ, హెచ్‌ఎండీఏ వెంచర్‌, తొర్రూర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ, తొర్రూర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంఆర్‌ఆర్‌, బాలాజీ, గణేష్‌ నగర్‌ కాలనీ, తొర్రూర్‌ విలేజ్‌, విశ్వామిత్ర, వెంకటేశ్వర, జనచైతన్య కాలనీ, రేణుక రెసిడెన్సీ, కుర్మబస్తీలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.


మల్కాజిగిరి: వినాయక్‌నగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ ట్యాంక్‌బండ్‌ ఫీడర్‌ 11 కేవీ వినాయక్‌నగర్‌ ఫీడర్‌ మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు మినీ ట్యాంక్‌బండ్‌, బలరాం నగర్‌, సీతారాంనగర్‌, శారదానగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఏఈ సుమన్‌ క్రిస్టియానా కోరారు.


city1.2.jpgరామంతాపూర్‌: రామంతాపూర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం పాశం సత్తయ్య కాలనీ ఫీడర్‌లోని మధురా నగర్‌, శ్రీనివాస్‌ పురం, పీఎస్‌ కాలనీ ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రాఘవేంద్ర స్వామి ఆలయం ఫీడర్‌లోని గణేష్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్‌, పి.ఎస్‌ కాలనీ, రామంతాపూర్‌ ప్రధాన రహదారి ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకుంటుందని సంబంధిత ట్రాన్స్‌ కో ఏఈ కూతడి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.


బోయినపల్లి: బోయినపల్లి 11 కేవీ ఫీడర్స్‌ పరిధిలో ట్రీ ట్రిమ్మింగ్‌, ఫీడర్స్‌ ఫర్‌ మెయింటెనెన్స్‌ పనులు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ఎడీఈ కె. నాగరాజు గురువారం తెలిపారు. బోయినపల్లి ప్లాస్సీ లైన్స్‌ ఏరియాలో ఉదయం 9:30 నుంచి 12 గంటలకు ప్లాసీ లైన్‌, మెయిన్‌ రోడ్‌, ఆర్‌ఆర్‌ నగర్‌ రోడ్డు నెంబర్‌ 1, 10, చెక్‌ పోస్టు, కరెంట్‌ ఆఫీస్‌, హోండా షోరూం, శ్రీసాయి కాలనీ, శారదా ఆగ్రో, అరోమోర్‌ భవన్‌, ఎంబిఎన్‌ ఎస్టేట్‌, నందమూరి నగర్‌, మెట్రో స్టేషన్‌, సాయిబాబా టెంపుల్‌, ఎంఎంఆర్‌ గార్డెన్‌; అదేవిధంగా కొత్త బోయినపల్లి ఆలీ కాంప్లెక్ల్‌ ఏరియాలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రియదర్శిని, అలీ కాంప్లెక్స్‌, బడగూడ, హర్షవర్థన్‌ కాలనీ, ఓల్డ్‌ బోయినపల్లి చివరి బస్‌స్టాప్‌, లక్కీ హోమ్స్‌ రోడ్‌ నెం 1, సానా మిల్క్‌ సెంటర్‌, శ్రీ సాయి ఎంక్లేవ్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని తెలిపా రు. వినియోగదారులు సహకరించాలని కోరారు.


పేట్‌బషీరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో చెట్లకొమ్మలు తొలగింపు కారణంగా శుక్రవారం విద్యుత్‌ ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గాయత్రినగర్‌ ఫీడర్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాయత్రినగర్‌ పరిధి, గోదారి హోమ్‌, సుచిత్ర ఫీడర్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సుచిత్ర మెయిన్‌రోడ్డు ఏరియా, గ్రీన్‌పార్కు ఏరి యా ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని వినియోగ దారులు సహకరించాలని కోరారు. అలాగే.. కొంపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలోని కార్తీకవనం ఫీడర్‌, దూలపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అయ్యప్పకాలనీ, ఎంజెంట్‌ పరిశ్రమ, అమృత హోమ్స్‌, ఫారెస్టు ఏరియా, దూలపల్లి విలేజ్‌, క్రౌన్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు చైనాబజా ర్‌, ఫాక్స్‌సాగర్‌, చంద్రగల్లీ, క్రౌన్‌గల్లీ, దూలపల్లి గ్రామం పరిధిలో విద్యుత్‌ ఉండదని వినియోగ దారులు సహకరించాలని ఏఈ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికవర్‌ హాస్పిటల్స్‌పై కేకేఆర్‌ కన్ను!

బంగారం దిగుమతులు 70 శాతం డౌన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 07:40 AM