రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్స్‌లో రెండింతల మార్కెట్ వాటా లక్ష్యం
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:53 AM
బాష్, సీమెన్స్ బ్రాండ్స్‌తో గృహాపకరణాల ఉత్పత్తులను విక్రయిస్తున్న బీఎ్‌సహెచ్ హోమ్ అప్లయెన్సెస్.. ఈ ఏడాది వాషింగ్ మెషిన్స్...
బీఎస్ హెచ్ హోం అప్లయెన్సెస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బాష్, సీమెన్స్ బ్రాండ్స్‌తో గృహాపకరణాల ఉత్పత్తులను విక్రయిస్తున్న బీఎ్‌సహెచ్ హోమ్ అప్లయెన్సెస్.. ఈ ఏడాది వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో వాటాను రెండింతలు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం నాడిక్కడ మార్కెట్లోకి బాష్.. ఫోర్ డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ హెడ్ (గ్రోత్, బిజినె్‌స) అరుణ్ మీనన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వాషింగ్ మెషిన్ మార్కెట్లో బీఎ్‌సహెచ్ వాటా 6 శాతంగా ఉండగా ఈ ఏడాది దీన్ని 12 శాతానికి పెంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. రిఫ్రిజిరేటర్ల మార్కెట్లోకి కంపెనీ గత ఏడాదే అడుగుపెట్టిందని, ప్రస్తుతం ఈ విభాగంలో రెండు శాతం వాటా కలిగి ఉండగా దీన్ని రెండింతలు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ గృహోపకరణాన్నింటిని చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కంపెనీ ఐదు బాష్ స్టోర్లను నిర్వహిస్తుండగా ఏడాది చివరి నాటికి వీటిని 12కు చేర్చాలని చూస్తున్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాష్, సీమెన్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఇందుకు తగ్గట్టుగానే నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..