బంగారం దిగుమతులు 70 శాతం డౌన్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:50 AM
సుంకాన్ని రెట్టింపు చేయడంతో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు 70 శాతం తగ్గి 25-30 టన్నులకు పరిమితమైనట్లు ప్రభుత్వ అధికారి...
న్యూఢిల్లీ: సుంకాన్ని రెట్టింపు చేయడంతో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు 70 శాతం తగ్గి 25-30 టన్నులకు పరిమితమైనట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. విదేశీ మారక నిల్వలను రక్షించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. మే 13 నుంచి పెంచిన సుంకం అమల్లోకి వచ్చింది. దాంతో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. గతంలో నెలకు 75-100 టన్నుల బంగారం దిగుమతయ్యేదని, గడిచిన నెల రోజుల్లో దిగుమతులు 25-30 టన్నులకు పడిపోయాయని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..