హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్
ABN , Publish Date - Jul 16 , 2026 | 07:40 AM
నిర్వహణ పనులు, చెట్ల కొట్టివేత నేపథ్యంలో గురువారం బోడుప్పల్‌లోని 33/11 కేవీ ఇందిరానగర్ సబ్‌స్టేషన్ పరిధిలో రెండు ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్.వేణుగోపాల్ తెలిపారు.
హైదరాబాద్: నిర్వహణ పనులు, చెట్ల కొట్టివేత నేపథ్యంలో గురువారం బోడుప్పల్‌లోని 33/11 కేవీ ఇందిరానగర్ సబ్‌స్టేషన్ పరిధిలో రెండు ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్.వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు 11 కేవీ ఎస్‌బీఆర్ కాలనీ ఫీడర్ ... పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్‌రెడ్డి కాలనీ, ఆర్‌ఎన్‌జీఎస్ కాలనీ, బీఎల్ నగర్, అంజయ్య ఎన్‌క్లేవ్, టెలిఫోన్ కాలనీ ఫేజ్-2, పీఎన్‌ఆర్ కాలనీ, రెడ్డీస్ కాలనీ, భవానీ కాలనీ, శుభోదయ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ,
అనగాపురి కాలనీ, భీమ్‌రెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ బొల్లిగూడెం ఫీడర్ .. బొల్లిగూడెం, అంజయ్య ఎన్‌క్లేవ్, ఎస్‌బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, రాజలింగం కాలనీ ఫేజ్-1, ఫేజ్-2, సూరజ్ నగర్, మహాలక్ష్మి నగర్, బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
రాయదుర్గం: ఓక్రిడ్జి, జైన్‌హోం 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకృష్ణప్రసాద్ తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఖాజాగూడ గ్రామం, జైన్‌హోమ్స్‌లో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సంక్షోభాల వేళా రైతుల సంక్షేమానికి పెద్దపీట
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News