హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:28 AM
టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం 11కేవీ భానునగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం 11కేవీ భానునగర్ ఫీడర్ పరిధిలోని అన్నా డైరీఫామ్, ముంతాజ్ కాలనీ, భాను నగర్, టర్నింగ్ పాయింట్ స్కూల్, క్రీడా రోడ్డు పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చంద్రయ్య హట్స్ ఫీడర్ పరిధిలోని ఐబీపీ పెట్రోల్ బంక్, ఎస్‌బీఐ బ్యాంకు క్రిస్టల్ బార్, ఎస్‌ఎన్‌ఆర్ లైబ్రరీ, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.
నార్సింగ్: మణికొండ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖాధికారలు తెలిపారు.
- మార్కెట్ యార్డు సబ్‌స్టేషన్ పరిధిలోని మైహోమ్ అవతార్, నెమలినగర్ రోడ్డు కేశవనగర్, మార్వాటౌన్‌షిప్, వైఎస్ఆర్ జంక్షన్, మాంగళ్య షాపింగ్‌మాల్, నార్సింగ్ గ్రామం, సాయిబాబా ఆలయం, ఓఆర్‌ఆర్ సర్కిల్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ ఉండదన్నారు.
- వట్టినాగులపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని లాన్సమ్, లిసాగ్రేవ్, జయభేరి పార్కు, శంకర్ ఆసుపత్రి, శ్రీహిల్స్, ప్రధాన కన్వెన్షన్, జయభేరి సర్వీస్ రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News