Share News

యాదగిరిగుట్టలో తిరుమల తరహాలో సౌకర్యాలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 06:09 AM

రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు... తిరుమల స్థాయిలో మౌలిక సౌకర్యాల..

యాదగిరిగుట్టలో తిరుమల తరహాలో సౌకర్యాలు

  • పాలకమండలి చైర్మన్‌, సభ్యులకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, యాదాద్రి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు... తిరుమల స్థాయిలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని వైటీడీ పాలక మండలికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే స్థాయిలో ఆలయ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జూన్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ పాలకమండలిని నియమించింది. ఈ నెల 11న వీరు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌బోర్డుకు నియమితులైన వారిని ఆయన అభినందించారు. సీఎం కలిసినవారిలో సభ్యులు వినోద్‌ వెంకటస్వామి(ఎమ్మెల్యే), కొణిదల సురేఖ, సి.విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌, డాక్టర్‌ మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం.రాఘవేందర్‌రావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ఈవో భవానీశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 06:10 AM