హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:43 AM
హైదరాబాద్ నగరంలోని బాలాజీనగర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో వార్షిక నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు బాలాజీనగర్ విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాలాజీనగర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో వార్షిక నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు బాలాజీనగర్ విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావు తెలిపారు. ఈ అంతరాయం వల్ల బాలాజీనగర్, చంద్రపురి కాలనీ, మోహన్‌రావు కాలనీ, వెంకటేశ్వర కాలనీ, న్యూ వెంకటేశ్వర కాలనీ, శాంతినగర్, ఆనంద్‌నగర్, మరవాడి లైన్, శివాజీనగర్, సంతోష్ నగర్, ముత్యంస్వామి కాలనీ, భక్తాబాయి కాలనీ, బ్రిందావన్ కాలనీ, సిటిజన్ కాలనీ, వీరభద్ర కాలనీ, కేపీఎన్ కాలనీ, బజరంగ్నగర్, జ్యోతి కాలనీ, సీపీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. అలాగే మార్కెట్ రోడ్డు, సాయిబాబా కమాన్ రోడ్డు, వీఆర్వో రోడ్డు, ఫైరింగ్ కట్ట, గీతాంజలి పాఠశాల, జేఎన్పీ పాఠశాల, కేఎల్ఆర్ వాటర్ ప్లాంట్ పరిసర ప్రాంతాలపై కూడా ప్రభావం ఉంటుందని తెలిపారు.
సంతోష్ నగర్: సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని 11కేవీ ఆల్ ఇండియా రేడియో, జవహర్‌నగర్, విష్ణు థియేటర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహణ, మరమ్మతులు, చెట్లకొమ్మల కొట్టివేత పనుల కారణంగా గురువారం విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. 11కేవీ ఆల్ ఇండియా రేడియో, జవహర్‌నగర్, విష్ణు థియేటర్ఫీడర్ల పరిధిలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
గాజులరామారం: గాజులరామారం విద్యుత్ సబ్ స్టేషన్ 132కేవీ ట్రాన్స్‌కో కొత్తలైన్ పనుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ చైతన్య భార్గవ్ ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఇందిరా నగర్- బీ, చంద్రగిరినగర్, అంబేడ్కర్‌నగర్, చంద్రగిరినగర్దర్గా, బాలాజీ స్కూల్ లైన్లో విద్యుత్ ఉండదని, ఎవరికైనా ఏమైన సమస్యలుంటే ఫిర్యాదు కోసం హెల్ప్‌లైన్ 1912, ఫోన్‌నెంబరు 8712472592కు ఫిర్యాదు చేయవచ్చు అని ఏఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా
నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News