Share News

ఓబీసీల డ్రాప్‌డౌన్‌ జాబితా అందుబాటులో ఉంచాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:02 AM

జనగణన ప్రక్రియలో వెనకబడిన తరగతులకు(ఓబీసీ) సంబంధించిన డ్రాప్‌డౌన్‌ జాబితాను అందుబాటులో ఉంచాలని... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జనగణన కమిషనర్‌ మృత్యుంజయ్‌కి బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ లేఖ రాశారు.

ఓబీసీల డ్రాప్‌డౌన్‌ జాబితా అందుబాటులో ఉంచాలి

  • కేంద్ర హోంమంత్రికి నిరంజన్‌ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జనగణన ప్రక్రియలో వెనకబడిన తరగతులకు(ఓబీసీ) సంబంధించిన డ్రాప్‌డౌన్‌ జాబితాను అందుబాటులో ఉంచాలని... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జనగణన కమిషనర్‌ మృత్యుంజయ్‌కి బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ లేఖ రాశారు.


మతాలు, షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ) విషయంలో డ్రాప్‌డౌన్‌ జాబితాలు అందుబాటులో ఉంచి... ఇతర వెనకబడిన తరగతులకు మాత్రం అలాంటి జాబితాలు సమకూర్చక పోవడం అన్యాయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఓబీసీలకు సంబంధించిన డ్రాప్‌డౌన్‌ జాబితాను అందుబాటులోకి తేవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 07:02 AM