ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:23 PM
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్18: ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ బీమా పథకాలన్నీ ఇందిరమ్మ బీమా గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు వివరించారు. నేతన్న, గౌడ, కార్మిక, మత్స్యకారుల రూ.2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ బీమా భద్రత కల్పించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. కుటుంబంలోని సభ్యులందరూ నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు వివరించారు. దాదాపు నెల రోజుల పాటు ఈ నమోదు ప్రక్రియ కొనసాగనుందని అన్నారు. ఆన్‌లైన్ నమోదుకు ప్రత్యేక యాప్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
4.63 లక్షల మందికి పెన్షన్లు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News