Share News

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. ఒకే ఫ్రేమ్‌లో..

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:08 PM

షెంజెన్‌లో జరుగుతున్న ఏపీఈసీ సమావేశాల సందర్భంగా నేడు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. ఒకే ఫ్రేమ్‌లో..
Vladimir Putin meets Trump, Xi Jinping

ఇంటర్నెట్ డెస్క్: షెంజెన్‌లో జరుగుతున్న ఏపీఈసీ సమావేశాల సందర్భంగా నేడు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి ఫొటోకు పోజులిచ్చారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వారు అక్కడ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అప్పటికే రెడ్ కార్పెట్‌పై నిలబడ్డ ట్రంప్, షీను సమీపించిన పుతిన్ వారితో ముచ్చటించిన అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. 2025 ఆగస్టులో అలాస్కాలో చర్చల సందర్భంగా ట్రంప్, పుతిన్‌లు కలిశారు.


ట్రంప్ వచ్చేందుకు కొన్ని గంటల ముందే పుతిన్ షెజెన్‌కు వచ్చారు. అక్కడ చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు. ఆ తరువాత వచ్చిన ట్రంప్‌కు షీ స్వయంగా ఆహ్వానం పలికారు. ట్రంప్‌తో పుతిన్, షీ జిన్‌పింగ్‌లు కలుపుగోలుగా కనిపించినప్పటికీ అమెరికా తీరును మాత్రం వారు విమర్శించారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక గురువారం ట్రంప్, పుతిన్, షీజిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా వారు అణునిరాయుధీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. ఇక ఎన్విడియా సీఈఓ ఉదంతం నేపథ్యంలో తమ ఏఐ సాంకేతికత చైనాకు అందకుండా అమెరికా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.


ఈ వార్తలనూ చదవండి:

షీ జిన్‌పింగ్, పుతిన్‌లతో కీలక భేటీ కోసం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్

కాలిఫోర్నియాలో దారుణం.. గర్భిణిని నేలపైకి ఈడ్చి పెప్పర్ స్ప్రే చల్లిన ICE అధికారులు

Updated Date - Nov 18 , 2026 | 07:08 PM