Share News

హైదరాబాద్‌లో నేడు విద్యుత్‌ కోత.. ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్

ABN , Publish Date - Sep 29 , 2026 | 07:49 AM

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‏కో అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో నేడు విద్యుత్‌ కోత.. ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్
Hyderabad Power Cut

హైదరాబాద్: 33 కేవీ టవర్‌ ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం హైదరాబాద్ నగరంలోని హేమానగర్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సాయిభవానీనగర్‌, గాయత్రిహిల్స్‌, మల్లయ్యనగర్‌, వాసవినగర్‌, సప్తగిరి కాలనీ, నార్త్‌ బాలాజీహిల్స్‌, హేమానగర్‌, తిరుమల మెడోస్‌, రెడ్డీస్‌ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుంది.


city1.2.jpgహైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌ సెక్షన్‌ పరిధిలో పీఎంఐ, ఆర్‌ఎంయూ పనుల నిమిత్తం మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోకుల్‌ ఫ్లాట్స్‌, విజేత సూపర్‌ మార్కెట్‌ పరిసర ప్రాంతాలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సాయినగర్‌, సర్దార్‌ పటేల్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంచనాలకు అందని స్థాయిలో బంగారం పతనం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 07:49 AM