Share News

పరీక్షల్లో ఫెయిలయ్యానని మెడికో ఆత్మహత్య

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:53 AM

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదనే బాధతో ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పరీక్షల్లో ఫెయిలయ్యానని మెడికో ఆత్మహత్య
Karimnagar MBBS student

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదనే బాధతో ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణాజిల్లా తాడిగడప గ్రామానికి చెందిన నాగడి పునీత్‌ వర్మ (28)కు 2019లో కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. 2025లోనే కోర్సు పూర్తి చేయాల్సి ఉండగా.. మానసిక సమస్యలతో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయాడు.


కుమారుడి మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన తల్లిదండ్రులు శంకర్‌బాబు దంపతులు కరీంనగర్‌కు వచ్చి గుంటూరుపల్లిలోని ఓ అద్దె ఇంట్లో కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మానసిక వేదనకు గురైన పునీత్‌ వర్మ.. అధిక మోతాదులో బెంజోడియాజిపైన్‌ తరహా మాత్రలు తీసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.


వార్తలు కూడా చదవండి:
మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ

నారాయణపేట జిల్లాలో జింకల వేట

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 06:53 AM