నారాయణపేట జిల్లాలో జింకల వేట
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:41 AM
నారాయణపేట జిల్లాలో జింకలను వేటాడి మాంసం తరలిస్తున్న తొమ్మిది మందిని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది.
తుపాకీ తూటాలకు కృష్ణజింక బలి
గుట్టుగా జింక మాంసం తరలిస్తున్న 9 మంది అరెస్టు
నారాయణపేట/ఊట్కూర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో జింకలను వేటాడి మాంసం తరలిస్తున్న తొమ్మిది మందిని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన రియాజ్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మరో ఎనిమిది మంది నిందితులు ఆదివారం రెండు వాహనాల్లో ఊట్కూర్ మండలంలోని లక్ష్మీపల్లి అటవీ ప్రాంతానికి వచ్చి కృష్ణజింకను తుపాకీతో వేటాడి చంపారు. అక్కడే జింక తల, కాళ్లు శరీర భాగాలను తొలగించి కేవలం మాంసాన్ని తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు.
షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలో నిందితుల ముఠా పట్టుబడింది. పదమూడు కిలోల జింక మాంసంతో పాటు ఓ తుపాకీ, 19బుల్లెట్లు, స్కార్పియో, ఎనిమిది సెల్‌ఫోన్లు, రెండు టార్చిలైట్లు, కెమెరా, రూ.28,590 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అమన్‌గల్ అటవీశాఖ సిబ్బందితో పాటు జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారి కమాలోద్దీన్, బీట్ అధికారి సంతోష్ సోమవారం నిందితులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 9మంది నిందితుల్లో ఎండీ హజీఉద్దీన్, మీర్ ముక్తార్ అలీ, ఎండీ తాజముల్, మీర్‌రాజా అలీఖాన్, బుర్రమ్ ఖాన్, సయ్యద్ సల్మాస్ అలీ, ఎండీ అప్రోజ్ ఖాన్, ఎండీ అబ్దుల్ అజీజ్, ఎండీ రియాజ్ ఉన్నారు.
వార్తలు కూడా చదవండి:
మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ
Read Latest AP News And Telangana News And International News And Telugu New