Share News

కారుణ్య కొలువు కష్టాలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:35 AM

అనారోగ్యంతో ముందస్తు పదవీ విరమణ చేసిన తండ్రికి బదులుగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వమని అతడి కొడుకు దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామక కొలువు సంగతి అలా ఉంచితే..

కారుణ్య కొలువు కష్టాలు
Suryapet bribe case

  • తండ్రి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్ల ఫైలు కదలాలంటే లంచం

  • బాధితుడి కొలువుపై ఆర్‌ అండ్‌ బీ అధికారుల కప్పదాట్లు

  • సూర్యాపేట కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు..

  • జూనియర్‌ అసిస్టెంట్‌పై వేటు

సూర్యాపేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ముందస్తు పదవీ విరమణ చేసిన తండ్రికి బదులుగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వమని అతడి కొడుకు దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామక కొలువు సంగతి అలా ఉంచితే.. ఆ తర్వాత మరణించిన అతడి తండ్రి పదవీ విరమణ ప్రయోజనాల ఫైలుకు క్లియరెన్స్‌ ఇవ్వాలంటే అధికారులు రూ.1.25 లక్షల లంచం అడిగిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. ఈ విషయమై బాధితుడు మందపల్లి నాగేంద్రబాబు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌కు ఫిర్యాదు చేశారు.


నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట ఆర్‌ అండ్‌ బీశాఖలో వాచ్‌మన్‌గా పని చేసిన ఆయన తండ్రి భరత్‌బాబు.. అనారోగ్యంతో 2023 ఆగస్టు 31న ముందస్తు పదవీ విరమణ చేశాడు. అదే ఏడాది సెప్టెంబరు 21న కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని నల్లగొండలోని ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయంలో నాగేంద్రబాబు దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, అదే ఏడాది నవంబరు ఏడో తేదీన అనారోగ్యంతో భరత్‌ బాబు మృతి చెందాడు. నల్లగొండలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఖాళీ లేదని పేర్కొంటూ.. నాగేంద్రబాబు కారుణ్య నియామక ఫైలు సూర్యాపేటకు.. 2025 మార్చి 20న తిరిగి నల్లగొండకు చక్కర్లు కొట్టింది. గతేడాది డిసెంబరు 31న కోదాడలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఖాళీ అవుతుందని నాగేంద్రబాబుకు సమాచారం ఇచ్చిన అధికారులు.. 2025 జూన్‌ 15న దరఖాస్తు పెట్టుకున్న మరో యువకుడికి ఈ ఏడాది జనవరి 26న ఉద్యోగం ఇచ్చారు.


అదేమిటని ఆర్‌ అండ్‌ బీలోని సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్లను సంప్రదిస్తే.. ఆ నియామకాన్ని రద్దు చేసి ఉద్యోగం ఇస్తామని.. కొన్ని రోజులకు కొత్త ఎస్‌ఈ వచ్చాక ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. నూతన ఎస్‌ఈని అడిగితే గత జూలైలో ఖాళీ అయ్యే మరో ఉద్యోగం ఇస్తామని నమ్మించారు. కానీ, పురోగతి లేకపోవడంతో బాధితుడు నల్లగొండ ఎస్‌ఈతోపాటు ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే, భరత్‌బాబు పదవీ విరమణ ప్రయోజనాల ఫైలును సిద్ధం చేయడానికి ఆర్‌ అండ్‌ బీ సూర్యాపేట డీఈ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ రూ.1.25 లక్షల లంచం అడిగాడు. 2023 అక్టోబరు 11న సదరు జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.24వేలు పంపినా, మిగతా డబ్బు ఇస్తేనే ఫైలు సిద్ధం చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు నాగేంద్రబాబు సదరు అధికారులు, జూనియర్‌ అసిస్టెంట్‌పై కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్‌.. లంచం తీసుకున్న్డట్లు తేలడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీరామ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఫైలు సిద్ధం చేయడంలో జాప్యానికి కారణాలపై విచారణకు కమిటీని వేశారు.


వార్తలు కూడా చదవండి:
మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ

భాద్రపదంలో గ్రీష్మం!

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 06:35 AM