Share News

రౌడీషీటర్లకు డ్రగ్స్ పరీక్షలు.. పలువురికి పాజిటివ్

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:14 PM

నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1300 మంది రౌడీషీటర్లను గుర్తించారు.

రౌడీషీటర్లకు డ్రగ్స్ పరీక్షలు.. పలువురికి పాజిటివ్

హైదరాబాద్, ఏప్రిల్10: నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1300 మంది రౌడీషీటర్లను గుర్తించారు. వారిలో 239 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 189 మందికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన 50 మందికి నెగటివ్ వచ్చింది.

వీరంతా గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి ఎక్కడ నుంచి వస్తుందంటూ వారిని పోలీసులు విచారిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా.. 44 మందికి పాజిటివ్, 26 మందికి నెగటివ్, ఉస్మానియా ఆసుపత్రిలో 80 మందికి పరీక్షలు చేయగా.. 59 మందికి పాజిటివ్, 21 మందికి నెగటివ్, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 89 మందికి పరీక్షలు చేయగా 86 మందికి పాజిటివ్, ముగ్గురికి నెగటివ్ వచ్చింది.


ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో పరీక్షించిన వారిలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరీక్షల అనంతరం వారికి వైద్యులు, మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రగ్స్‌ వినియోగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైదరాబాద్ నగర పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ రాజేంద్రనగర్ జోన్ చాంద్రాయణగుట్టలో గురువారం అర్థరాత్రి పలువురు రౌడీ షీటర్లకు డ్రగ్స్ రాపిడ్ టెస్ట్‌ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు మతీన్ జబ్రీ, హశంలతోపాటు రెహన్, వజహత్ అలీలకు ఈ రాపిడ్ టెస్ట్‌లో పాజిటీవ్ వచ్చింది. దాంతో వారిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జ్యుడిషీయల్ అధికారుల ఎదుట వారిని పోలీసులు హాజరుపరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి

జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్

For More TG News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 03:42 PM