హైదరాబాద్‌లో 24/7 పోలీస్ పెట్రోలింగ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 08:35 AM
హైదరాబాద్ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నగరంలో రౌడీషీటర్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం సిటీలో 1,476 మంది రౌడీషీటర్స్ ఉండగా, వారిలో 1,173 మంది బయట ఉన్నట్లు వెల్లడించారు.
బైక్ స్టంట్లపై స్పెషల్ డ్రైవ్
నగరంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ.. బైక్‌లపై ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న పోకిరీలు, ఆకతాయిలకు ముకుతాడు వేయడానికి సిటీలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని సీపీ వివరించారు. సీసీటీల ద్వారా అలాంటి వారిని గుర్తించి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!
Read Latest Telangana News and National News