కల్తీ స్వీట్లను అమ్మడంపై హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై కేసు
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:06 PM
అత్తాపూర్‌లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన, ఫంగస్ వచ్చిన స్వీట్స్‌ను అమ్మారని పోలీలసులకు బాధితులు ఫిర్యాదు చేశారు..
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): అత్తాపూర్‌లోని ప్రముఖ 'హల్దీరామ్ స్వీట్ హౌస్' (Haldiram Sweet House)పై పోలీసులు ఇవాళ(మంగళవారం) కేసు నమోదు చేశారు. కల్తీ, నాణ్యత లేని స్వీట్లను విక్రయిస్తున్నారనే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
కల్తీ స్వీట్ల విక్రయం..
అత్తాపూర్‌లోని హల్దీరామ్ స్వీట్ హౌస్‌లో స్వీట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు.. అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండటాన్ని గమనించారు. పాడైపోయిన స్వీట్ల గురించి నిర్వాహకులని ప్రశ్నించగా, వారు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు..
యాజమాన్యం తీరుతో విసిగిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, నివేదికలో కల్తీ జరిగిందని తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News