Share News

బాలికపై లైంగిక దాడికి యత్నించిన సెక్యూరిటీ గార్డుకు 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:34 AM

రామచిలుకను చూపిస్తానంటూ 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

బాలికపై లైంగిక దాడికి యత్నించిన సెక్యూరిటీ గార్డుకు 20 ఏళ్ల జైలు శిక్ష

  • బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం

  • ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఆదేశం

నార్సింగ్‌, హైదరాబాద్‌ సిటీ, సైదాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రామచిలుకను చూపిస్తానంటూ 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అసోంకు చెందిన రానోజ్‌ తైపీ (23)కి ఈ శిక్ష విధిస్తూ రాజేంద్రగనగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జి టి శ్రీనివాస్‌ తీర్పు చెప్పారు. రూ. వేయి జరిమానా కూడా విధించారు. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందించాలని కూడా ఆదేశించారు. 2024 ఆగస్టు 21న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదేళ్ల బాలిక తన పెంపుడు రామచిలుక కోసం వెతుకుతోంది. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిందితుడు చిలుకను చూపిస్తానని నమ్మించి ఆ బాలికను అయిదో అంతస్తు టెర్ర్‌సపైకి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించి రెండో అంతస్తుకు చేరుకుంది. అనంతరం జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీనిపై కేసు నమోదు చేసిన నార్సింగ్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.


అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్‌ జడ్జి అర్చన కుమారి తీర్పునిచ్చారు. 2021లో నిందితుడైన మంజూర్‌ అహ్మద్‌ అబ్రార్‌ అలియాస్‌ అబ్రార్‌పై పోక్సో కింద కేసు నమోదయింది. నేరం రుజువు కావడంతో అబ్రార్‌కు ఈ కఠిన శిక్ష విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:34 AM