Share News

ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో గంజాయి గుప్పు

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:23 AM

ఐటీ కారిడార్‌లోని పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టళ్లు గంజాయి అడ్డాలుగా మారుతున్నాయి.

ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో గంజాయి గుప్పు

  • మాదాపూర్‌, కొండాపూర్‌లో3 పీజీ హాస్టళ్లపై ఈగల్‌ దాడులు

  • 8 మందికి డ్రగ్‌ పరీక్షలు.. ఆరుగురికి పాజిటివ్‌

  • ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ముగ్గురు డెలివరీ బాయ్స్‌

  • హెల్ప్‌లైన్‌ 1908కి వచ్చిన సమాచారంతో సోదాలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్‌లోని పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టళ్లు గంజాయి అడ్డాలుగా మారుతున్నాయి. హాస్టళ్లలో మత్తుమందులు సేవిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ ఈగల్‌(ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) బృందాలు బుధవారం స్థానిక పోలీసులతో కలిసి మాదాపూర్‌, కొండాపూర్‌లోని మూడు హాస్టళ్లలో సోదాలు నిర్వహించాయి. గంజాయి సేవించారన్న అనుమానంతో ఎనిమిది మందికి డ్రగ్‌ పరీక్షలు చేశాయి. వారిలో ఆరుగురికి పాజిటివ్‌ ఫలితం రావడంతో కేసులు నమోదు చేశారు.


పట్టుబడిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ముగ్గురు అమెజాన్‌ డెలివరీ బాయ్స్‌, ఒక ఫార్మసిస్ట్‌ ఉన్నారని ఈగల్‌ అధికారులు తెలిపారు. ఈగల్‌ హెల్ప్‌లైన్‌ 1908కి వచ్చిన సమాచారం ఆధారంగానే సోదాలు చేశామని చెప్పారు. ఐటీ కారిడార్‌ హాస్టళ్లలో ఇలాంటి ఘటన బయటపడటం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 19న(గురువారం) మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిద్దిక్‌నగర్‌లో ఉన్న హరిహర జ్ఞానేశ్వర మెన్స్‌ పీజీ హాస్టల్‌పై ఈగల్‌ బృందాలు దాడి చేశాయి. అక్కడ ఎనిమిది మందికి మూత్ర పరీక్షలు చేయగా, గంజాయిలోని మత్తు పదార్థం టీహెచ్‌సీ ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది.


హాస్టళ్లే అడ్డాలు

మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లు, షేర్డ్‌ గదుల్లో వేలాది మంది యువ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల కార్మికులు ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో చాలా హాస్టళ్లు అనుమతులు, పర్యవేక్షణ లేకుండానే నడుస్తున్నాయి. సందర్శకులపై నియంత్రణ లేకపోవడంతో సరఫరాదారులు నేరుగా హాస్టళ్లకే సరుకు చేరవేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉండే యువకుడి అరెస్టుతో ఒడిశా - హైదరాబాద్‌ గంజాయి నెట్‌వర్క్‌ బయటపడింది. ఆ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, ఏడుగురు విద్యార్థులతో సహా వంద మంది వినియోగదారులు పట్టుబడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:25 AM