Share News

అప్పు తీర్చమన్నందుకు హత్య.. ఇద్దరికి జీవిత ఖైదు

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:36 AM

తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని అడిగిన వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఇద్దరికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

అప్పు తీర్చమన్నందుకు హత్య.. ఇద్దరికి జీవిత ఖైదు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని అడిగిన వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఇద్దరికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. జగద్గిరిగుట్ట మగ్దూమ్‌నగర్‌కు చెందిన నితాయ్‌ రాకేష్‌(33), షేక్‌ బాబర్‌ జానీ(34)లకు ఈ శిక్ష పడింది. స్నేహితులైన వారిద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఆనంద్‌కుమార్‌ అనే మరో వ్యక్తితో స్నేహం ఉంది. రూ.లక్ష అప్పు తీర్చే విషయంలో ఆనంద్‌కుమార్‌, రాకేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయి.


దీనిపై మాట్లాడుదామని 2015 సెప్టెంబరు 27న ఆనంద్‌కుమార్‌ను పిలిచి హత్యకు కుట్ర పన్నారు. అతడిపై బాబర్‌ పెట్రోల్‌ చల్లగా, రాకేష్‌ నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌కుమార్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కూకట్‌పల్లి మూడో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి వెంకటేశ్వరరావు నిందితులకు యావజ్జీవశిక్షతోపాటు రూ.5వేల వంతున జరిమానా విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:36 AM