Share News

ప్రాణం తీసిన మారథాన్‌..!?

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:58 AM

36 ఏళ్ల ఆ యువకుడు.. ఓ ఐటీ ఉద్యోగి.. ఎంతో ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నాడు. ఏకంగా 42.2 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకాలు కూడా అందుకున్నాడు.

ప్రాణం తీసిన మారథాన్‌..!?
Gopi

  • 42.2కిమీల పరుగు పూర్తి చేసిన కాసేపటికే ఆగిన 36 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె

రాయదుర్గం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): 36 ఏళ్ల ఆ యువకుడు.. ఓ ఐటీ ఉద్యోగి.. ఎంతో ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నాడు. ఏకంగా 42.2 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకాలు కూడా అందుకున్నాడు. కానీ ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఖమ్మం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన కొమ్మినేని గోపి (36) ప్రాణాలు కోల్పోయారు. ఐబీఎంలో ఐటీ ఉద్యోగి అయిన గోపి, భార్య, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నారు.


ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్‌ హైటెక్‌ మారధాన్‌ 8వ ఎడిషన్‌లో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఫుల్‌ మారథాన్‌ పూర్తి చేసిన గోపి.. నిర్వాహకుల నుంచి మెడల్స్‌ కూడా తీసుకున్నారు. బహుమతుల కార్యక్రమం ముగిసిన తర్వాత అల్పాహారం తీసుకునేందుకు వెళుతుండగా గోపి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గమనించిన నిర్వాహకులు గోపిని వెంటనే సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోపి అప్పటికే మరణించినట్టు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:58 AM