గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:25 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రామ్ గూడలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రేమానంద్ మల్లిక్, క్యాబ్ డ్రైవర్ విశాల్‌ను శేర్లింగంపల్లి ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకున్నాడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మరో వ్యక్తితో కలిసి నగరంలో గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు. ఆ ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రామ్ గూడలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రేమానంద్ మల్లిక్, క్యాబ్ డ్రైవర్ విశాల్‌ను శేర్లింగంపల్లి ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రేమానంద్ మల్లిక్, డ్రైవర్ విశాల్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. కాగా వీరికి గంజాయి అమ్మిన రాఘవేంద్ర, ఆకాశ్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్
రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు