బామ్మగారి గంజాయి దందా
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:47 AM
రూ.500కి 5గ్రాముల గంజాయి.. రోజుకు కనీసం 200 మంది కస్టమర్లు.. హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో 75 ఏళ్ల వయస్సున్న ఓ వృద్ధురాలు చేస్తున్న వ్యాపారం ఇది.
రూ.500కి 5గ్రాముల ప్యాకెట్
రెండు గంటల్లో 70 మందికి విక్రయం
హైదరాబాద్ ఫతేనగర్‌లో వృద్ధురాలి అరెస్టు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రూ.500కి 5గ్రాముల గంజాయి.. రోజుకు కనీసం 200 మంది కస్టమర్లు.. హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో 75 ఏళ్ల వయస్సున్న ఓ వృద్ధురాలు చేస్తున్న వ్యాపారం ఇది. ఇలా తొమ్మిదేళ్లుగా విజయవంతంగా గంజాయి దందా చేస్తున్న వృద్ధురాలిని ఈగల్ అధికారులు కటకటాల్లోకి నెట్టారు. ఫతేనగర్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్‌కి చెందిన జతీన్ బీ (75) గంజాయి అమ్ముతున్నట్లు ఈగల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో జతీన్‌బీ ఇంటి వద్ద ఈగల్ అధికారులు శుక్రవారం రాత్రి నిఘా పెట్టారు. ఒకరి తర్వాత మరొకరు ఆ ఇంట్లోకి వెళ్లి రావడాన్ని గమనించారు.
జతీన్‌బీ ఇంట్లోకి వెళ్లి వచ్చిన వారిని ఇతరులకు అనుమానం రాకుండా ఈగల్ అధికారులు గుట్టుగా పక్క కు తీసుకెళ్లి సోదాలు చేశారు. ఇలా రెండు గంటల వ్యవధిలో 70 మంది జేబుల్లో గంజాయి గుర్తించారు. జతీన్‌బీ రూ.500కి 5 గ్రాముల గంజాయి ప్యాకెట్ ఇస్తున్నట్టు వా రంతా వెల్లడించారు. ఆ 70 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా 66 మందికి పాజిటివ్ రావడంతో వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మైనర్లూ ఉ న్నారు. ఇక, జతీన్ బీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈగ ల్ బృందాలు దాదాపు 180 గ్రాముల గంజాయిని స్వాధీ నం చేసుకున్నాయి. తాను తొమ్మిదేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, రోజుకు సుమారు 200 మంది తనవద్ద గంజాయి కొనుగోలు చేస్తారని జతీన్ బీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News