Share News

హైదరాబాద్‌లో జోరుగా నకిలీ బర్త్ సర్టిఫికేట్ల దందా.. ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:57 PM

నకిలీ బర్త్ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 70 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో జోరుగా నకిలీ బర్త్ సర్టిఫికేట్ల దందా.. ముగ్గురి అరెస్ట్
fake birth certificate racket

హైదరాబాద్, నవంబర్ 11: నగరంలో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్న ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ కేంద్రంగా ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో నకిలీ సర్టిఫికేట్ల దందా కొనసాగుతుందన్న సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు.. ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో జీడిమెట్లకు చెందిన సలీం, మహమ్మద్ యాహియా, వెంకటేశ్‌లు.. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అన్నీ రాష్ట్రాలకు సంబంధించిన నకిలీ బర్త్ సర్టిఫికేట్లను నిమిషాల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా ఈ దందాను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారి నుంచి.. 70 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో.. మహమ్మద్ యాహియా ప్రధాన నిందితుడు కాగా.. మిగిలిన ఇద్దరు అతనికి సహకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి.. ఆర్సిపురం సైబర్ క్రైం పోలీసులకు అప్పగించారు.


ఈ వార్తలూ చదవండి

హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో మరుగు దొడ్ల మూసివేత

Updated Date - Nov 11 , 2026 | 02:57 PM